మహారాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి..
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయకండి. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయండి..
బీజేపీతో కొట్లాడే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని ఎదిరించగలవు..
ఢిల్లీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"దేశంలో కాంగ్రెస్, బీజేపీ రెండే పార్టీలు ఉండాలి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని రేవంత్ రెడ్డి అంటున్నారు.. నేను మహారాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న.. దయచేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయకండి.. ప్రాంతీయ పార్టీలకే ఓటేయండి.. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయండి.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చేశాం కదా.. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్‌కు ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ బీజేపీ దూకుడుని ఆపింది.. కాంగ్రెస్ ఎం చేయలేకపోయింది.. పశ్చిమ బెంగాల్లో మమతా బనెర్జీ బీజేపీని ఆపింది.. అంతిమంగా ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని ఎదిరించగలవు.." - కేటీఆర్
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
బీజేపీతో కొట్లాడే దమ్ము కాంగ్రెస్ కు లేదు.
— BRS News (@BRSParty_News) November 12, 2024
ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయండి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/5hOIbEKIoJ
కామెంట్‌ను పోస్ట్ చేయండి