ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైజీరియా రెండో అత్యున్నత జాతీయ అవార్డును అందుకున్నారు..
తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది.
నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు నరేంద్ర మోదీని ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్’ అవార్డుతో సత్కరించారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న రెండవ విదేశీ ప్రముఖుడిగా ప్రధాని మోదీ నిలిచారు.
క్వీన్ ఎలిజబెత్ తర్వాత, నైజీరియా ఈ అరుదైన జాతీయ అవార్డుతో మోదీని సత్కరించింది.
నైజీరియా అధ్యక్షుడి నుండి అవార్డును అందుకున్న అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపారు, ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు, భారత్-నైజీరియా మధ్య స్నేహానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ అవార్డుతో కలిపి ఇప్పటివరకు ప్రధాని మోదీ 17 దేశాల నుండి అత్యున్నత అవార్డులు అందుకున్నారు.
Thank you Nigeria for a productive visit, which will add strength and vigour to India-Nigeria friendship. pic.twitter.com/hoHjAcFa36
— Narendra Modi (@narendramodi) November 17, 2024
కామెంట్‌ను పోస్ట్ చేయండి