2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని కూడగట్టుకున్న తరువాత.. గులాబీ అగ్ర నాయకులు క్రమంగా పార్టీని విడుతు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.. ఇప్పటివరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే..
2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడంతో ఫిరాయింపులు మరింత జోరెక్కాయి..
తాజాగా మరో ఆరుగురు ఎమ్మెల్సీలు గురువారం అర్ధరాత్రి కాంగ్రెస్‌లో చేరి మాజీ సీఎం కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చారు..
సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్. ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు..
దేశ రాజకీయాల్లో చక్త్రం తిప్పుదాం అనుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకునే పనిలో బిజీ అయిపోయారు.. ఇంకెంత మంది పార్టీ మారుతారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..
కామెంట్‌ను పోస్ట్ చేయండి