దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్ : Revanth Reddy


KTR Tweet Himanshu Revanth Reddy Reaction Politics Mter

Telangana : హమాన్షు ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. "Missing this kid" అంటూ తన కుమారుడితో కలిసివున్న ఫోటోను కేటీఆర్ షేర్ చేశారు. 

క్షణాల్లో వైరల్ అయిన కేటీఆర్ ట్వీట్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. 

కేటీఆర్ ట్వీట్ ను రేవంత్ రెడ్డి కోట్ చేస్తూ "దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్..

కొడుకుతో  కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా..

ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని,

లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా?

సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక

ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన 

నీలా కాదనుకున్నావా?

కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక

కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా?

మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన

30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా?

తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి,

ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి,

ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన

మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుంది.." అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


0/Post a Comment/Comments