Telangana : బీజేపీ టికెట్ ఇవ్వకుంటే కొన్ని రోజులు రాజకీయాలు వదిలేసి హిందూ రాష్ట్రం కోసం పనిచేకుంటానని వ్యాఖ్యానించారు రాజాసింగ్.
తాను చచ్చినా కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని, స్వతంత్రంగా కూడా పోటీ చేసే ఆలోచన లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలందరూ తనవెంటే ఉన్నారని.. కొన్ని రోజుల్లో తనపై విధించిన సస్పెన్షన్ ను అధిష్టానం ఎత్తివేస్తుందన్నారు.
నేను సచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లను.. నా ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పోను.. pic.twitter.com/HEW102nV9M
— Raja Singh (@TigerRajaSingh) August 29, 2023
ఇటీవలే మాజీ ఎమ్మెల్యే ముకేశ్ గౌడ్ తనయుడు, బీజేపీ లీడర్ విక్రమ్ గౌడ్ గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు.
అయితే రెండు సార్లు గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ కు టికెట్ ఇస్తుందా.. లేక విక్రమ్ గౌడ్ కు అవకాశం ఇస్తుందా అనేది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి