బెంగాల్‌లో ఇటీవలే ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్ల దాడి చేసిన దుండగులు


West Bengal :
 పశ్చిమ బెంగాల్‌లో ఇటీవలే ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై సోమవారం దుండగులు రాళ్లు రువ్వారు. మాల్దా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ దాడిలో రైలు అద్దాలు పగిలిపోయాయి, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చీకట్లో ఎవరు రాళ్లు రువ్వారు, ఏ ఉద్దేశంతో రాళ్లు రువ్వారు అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 2022 డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దక్షిణ బెంగాల్ నుండి ఉత్తర బెంగాల్‌కు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అనుసంధానిస్తుంది. 

రైల్వే చట్టంలోని సెక్షన్ 154 కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఒక మెయిన్ డోర్ గ్లాస్ దెబ్బతినగా, ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఈ ఘటన వల్ల రైలు ఆలస్యం కాలేదని భారతీయ రైల్వే ప్రకటించింది. 



0/Post a Comment/Comments