ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నందుకు గాను ఎస్ఎస్ రాజమౌళి RRR టీమ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం అభినందించారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందన ట్వీట్ పై గాయకుడు అద్నాన్ సమీ తీవ్రంగా స్పందించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ లో "The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023." అని పోస్ట్ చేశారు.
సీఎం జగన్ ట్వీట్‌కు సమాధానమిస్తూ సింగర్ అద్నాన్ సమీ.. "Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country...Especially internationally, we are one country! This 'separatist' attitude is highly unhealthy as we saw in 1947!!! Thank you...Jai HIND." అని రియాక్ట్ అయ్యారు.
అద్నాన్ సమీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
Author : K Tejeshwar Goud
కామెంట్‌ను పోస్ట్ చేయండి