19,744 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం


బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 19,744 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్యాబినెట్ నిర్ణయాలను విలేకరులకు వివరించారు.

కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్ధి చేస్తామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఈ స్వచ్ఛమైన ఇంధన వనరుల తయారీకి భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రూ.19,744 కోట్లతో ఈ మిషన్‌కు ఆమోదం తెలిపిందన్నారు. 

2030 నాటికి దేశంలో దాదాపు 125 గిగావాట్ల అనుబంధ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో పాటు సంవత్సరానికి కనీసం 5 MMT (మిలియన్ మెట్రిక్ టన్నులు) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ పనిచేస్తుంది. 

0/Post a Comment/Comments