నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు - RRR టీంకు ప్రధాని మోదీ అభినందనలు

RRR Naatu Naatu Song Narendra Modi Golden Globe Award Politics Meter

80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో RRR గర్జించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా చారిత్రాత్మక విజయం సాధించి దేశం గర్వించేలా చేసిన విషయం తెలిసిందే.

సంగీత దర్శకుడు MM కీరవాణి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు'కు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుని సొంతం చేసుకున్నారు.

'నాటు నాటు వేడుకల పాట... పాటలో చాలా స్టామినా, ఎనర్జీని ప్రదర్శించాలనుకున్నాం' అని అవార్డు అందుకున్న సందర్భంగా ఎంఎం కీరవాణి అన్నారు. "ఈ గొప్ప అవార్డును అందుకుంటునందుకు చాలా సంతోషిస్తున్నాను. మొదటిసారి, ఇది (RRR) అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది, అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని తెలిపారు. 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై చిత్రీకరించిన ఈ పాటకు కీరవాణి దర్శకత్వం వహించి, కంపోజ్ చేశారు. 

భారత్ ప్రధాని ట్విట్టర్లో RRR టీంకు అభినందనలు తెలిపారు. 

"చాలా ప్రత్యేకమైన విజయం! ఎంఎం కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ కు అభినందనలు. 

ఎస్ఎస్ రాజమౌళి, Jr ఎన్టీఆర్, రామ్ చరణ్, RRR సినిమా బృందం మొత్తానికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. 

ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది." అని ట్వీట్ చేసారు మోదీ.

రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ సహా పలువురు RRR టీం సభ్యులు ఈ అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యారు.

 

0/Post a Comment/Comments