నోట్ల రద్దు నిర్ణయనికి వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు


2016లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. కరెన్సీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

శీతాకాల విరామం తర్వాత అత్యున్నత న్యాయస్థానం పునఃప్రారంభం కావడంతో జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. 2016 నవంబర్ 8 నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.

నోట్ల రద్దు కసరత్తు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని, ఫేక్ మనీ, టెర్రర్ ఫైనాన్సింగ్, నల్లధనం, పన్ను ఎగవేతలను ఎదుర్కోవడానికి నోట్ల రద్దు పెద్ద వ్యూహంలో భాగమని అఫిడవిట్‌లో కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపింది.

0/Post a Comment/Comments