ఐదుగురు బంగ్లాదేశి పౌరులను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు - నిందితులకు సమాజ్‌వాదీ పార్టీ MLA ఇర్ఫాన్ నకిలీ సర్టిఫికెట్ జారీ చేశారని విచారణలో తేలింది


Uttar Pradesh :
ఆదివారం, ఉత్తరప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో భారతీయ పౌరులుగా చెప్పుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బంగ్లాదేశ్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (SP) MLA ఇర్ఫాన్ సోలంకీ పట్టుబడ్డ ఈ బంగ్లాదేశీ నిందితులకు సంతకంతో కూడిన లేఖను జారీ చేశారు. అది వారిని భారతీయ పౌరులుగా ఇన్నిరోజులు గుర్తించింది.

నివేదికల ప్రకారం, పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తుల నుండి పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులతో సహా నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వారి నుండి విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాన్పూర్ జిల్లాలోని జజ్మౌ సెక్టార్‌లో కాల్పుల కేసుకు సంబంధించి MLA సోలంకిపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 48 గంటల తర్వాత ఈ ఐదుగురు బంగ్లాదేశ్ వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితులను రిజ్వాన్ మహ్మద్ (53), ఖలీద్ మజీద్ (79), హీనా ఖలీద్ (45), రుక్సర్ రిజ్వాన్ (21), రిజ్వాన్ (17) గా గుర్తించారు.

"బంగ్లాదేశ్ జాతీయుడు రిజ్వాన్, అతని కుటుంబ సభ్యులైన నలుగురిని అరెస్టు చేశారు కాన్పూర్ పోలీసులు. వారి వద్ద ఆధార్ కార్డులతో సహా పలు నకిలీ పత్రాలను కూడా గుర్తించాం. ఈ పత్రాలను ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి సర్టిఫైడ్ చేసారని తేలింది" అని అన్నారు కాన్పూర్ జాయింట్ సీపీ ఆనంద్ ప్రకాష్ తివారీ. 


0/Post a Comment/Comments