చైనా సైనికులకు భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది - తవాంగ్ ఘర్షణ పై అరుణాచల్ ఎంపీ తపిర్ గావో

File Photos

డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్-చైనాల మధ్య జరిగిన ఘర్షణపై అరుణాచల్ కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావో స్పందించారు. చైనా సైనికులకు భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చిందన్నారు.

"భారత్ వైపు కొన్ని గాయాలు జరిగాయని నేను విన్నాను, కానీ చైనా సైనికులకి చాలా ఎక్కువ గాయాలు అయ్యాయి. PLA(చైనీస్ ఆర్మీ) చర్యను నేను ఖండిస్తున్నాను. ఇండో-చైనా సరిహద్దులో పునరావృతమయ్యే ఇలాంటి ఘటనలు భారత్-చైనా మధ్య సంబంధాలను పాడుచేస్తాయని నేను చెప్పాలనుకుంటున్నాను. చైనా ఎంత ప్రయత్నించినా, సరిహద్దులో భారత సైన్యం ఒక్క అంగుళం కూడా వెనక్కి కదలదు.. చైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే భారత సైనికులు తగిన సమాధానం ఇస్తారు." అని అన్నారు తపిర్ గావో.

ఈ తవాంగ్ ఘర్షణలో 300 మంది చైనా సైనికులను తరిమికొట్టింది భారత సైన్యం. ఈ ఘటనపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. 


0/Post a Comment/Comments