రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటే ఎక్కువ జనం మా పరాసియా ర్యాలీలో వచ్చారు : నకుల్ నాథ్(మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని కుమారుడు)


Madhya Pradesh :
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన భారత్ జోడో యాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్. 

భారత్ జోడో యాత్రలో కనిపించిన జనం కంటే ఎక్కువ జనం పరాసియా ర్యాలీలో పాలుగోన్నారని (రాహుల్ గాంధీని విమర్శిస్తున్నట్లుగా) నకుల్ నాథ్ అన్నారు.

మధ్యప్రదేశ్ లోని బద్కుహి నుండి పరాసియా వరకు కాంగ్రెస్ పార్టీ చేప్పట్టిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ర్యాలీలో నకుల్ మాట్లాడుతూ.. "భరత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట నేను మధ్యప్రదేశ్ మొత్తం నడిచాను కానీ నేను ప    రాసియా ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. పరాసియా అసెంబ్లీ నియోజికవరంలో ఒరిజినల్ భారత్ జోడో యాత్రలో కనిపించిన జనం కంటే ఎక్కువ జనం వచ్చారు." అని వ్యాఖ్యానించినారు.

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా నకుల్ నాథ్ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ రాహుల్ గాంధీని ఎద్దేవాచేశారు. 

"కాంగ్రెస్ నేతలు ఆయనను (రాహుల్ గాంధీని) నాయకుడిగా పరిగణించనప్పుడు, ఇతర మిత్రులు & భారతదేశం ఆయనను ఎలా సీరియస్‌గా తీసుకుంటాయి?" అని అన్నారు షెహజాద్ పూనావాలా.

0/Post a Comment/Comments