మూడోసారి నేపాల్ ప్రధానిగా పుష్పా దహల్ 'ప్రచండ' - అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ


Nepal :
నేపాల్ రాష్ట్రపతి బిద్యా దేవి భండారీ ఆదివారం సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్) ఛైర్మన్ పుష్ప కమల్ దహల్ 'ప్రచండ'ను కొత్త ప్రధాన మంత్రిగా నియమించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(2) ప్రకారం ప్రచండ నేపాల్ ప్రధానమంత్రిగా నియమితులైనట్లు రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

అంతకుముందు మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంలో కీలక సమావేశం జరిగింది. రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రచండ, ఓలీ మధ్య అవగాహన కుదిరింది.

నేపాల్ ప్రధానిగా నియమితులైన ప్రచండకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 

"నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికైన ప్రచండకు హృదయపూర్వక అభినందనలు. భారత్, నేపాల్ మధ్య ప్రత్యేకమైన సంబంధం లోతైన సాంస్కృతిక అనుసంధానం & ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఈ స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేయటానికి నేను ఎదురుచూస్తున్నాను." అని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

0/Post a Comment/Comments