హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఉత్కంఠభరితంగా సాగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అధికారంలో ఉన్న బీజేపీ మొదట్లో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తరువాత వెనుకబడింది.
కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి 42.99%, కాంగ్రెస్ కి 43.91% శాతం ఓట్లు పడ్డాయి.
"హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు బీజేపీ పట్ల ఉన్న అభిమానం, మద్దతుకు ధన్యవాదాలు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తాం. రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తుతాం." అని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి