ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలంటూ రాహుల్ గాంధీ ట్వీట్


ప్రధాని నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్య సమస్యలతో బుధవారం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి హీరాబెన్ మోదీని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పరామర్శించారు. డాక్టర్లు హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

"తల్లి కొడుకుల మధ్య ప్రేమ శాశ్వతమైనది..వెలకట్టలేనిది. మోడీ జీ, ఈ కష్ట సమయంలో నా ప్రేమ, మద్దతు మీకుంటుంది.  మీ అమ్మ గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. 



0/Post a Comment/Comments