Karnataka : మంగళవారం మధ్యాహ్నం మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.
మైసూర్‌కు 13 కిలోమీటర్ల దూరంలోని కడ్కోలా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రహ్లాద్ మోదీ తన భార్య, కొడుకు, కోడలు, మనవడితో కలిసి మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీలో బండిపురాకు వెళ్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో డివైడర్‌ను ఢీకొట్టింది.
డ్రైవర్‌తో సహా ప్రయాణికులందరినీ మైసూరులోని జేఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రహ్లాద్ మోదీ మనవడి తలకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి