పేద ప్రజలకు శుభవార్త - డిసెంబర్ 2023 వరుకు ఉచిత రేషన్ అందించనున్న కేంద్ర ప్రభుత్వం

bjp govt free ration scheme narendra modi politics meter

పేద ప్రజలకు శుభవార్త.. మరో ఏడాది వరుకు ఉచితంగా రేషన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.

శుక్రవారం, జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) కింద డిసెంబర్ 31, 2023 వరకు ఉచిత రేషన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు.

కోవిడ్ సమయంలో ప్రారంభించిన 'ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' పథకాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టంలో విలీనం చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు ఉచితంగా రేషన్ అందజేస్తామని తెలిపింది. ఆహార భద్రత కోసం కేంద్రం ఇప్పుడు దాదాపు రూ.2 లక్షల కోట్ల భారాన్ని భరించనుంది.

విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కిలో బియ్యం రూ.3, గోధుమలు కిలో రూ.2కే అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) లబ్దిదారులకు బియ్యం, గోధుమలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. సుమారు 81.35 కోట్ల మంది ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందుతారు, వాటికి డబ్బులు  చెల్లించాల్సిన అవసరం లేదు." అని తెలిపారు. 

బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

0/Post a Comment/Comments