Karnataka : 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించింది. మాండ్యాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్, జేడీ(ఎస్)లపై విరుచుకుపడ్డారు.
JDS, కాంగ్రెస్‌లకు కంచుకోటగా భావించే మాండ్యాలో పార్టీ చేపట్టిన జన సంకల్ప యాత్రలో అమిత్ షా మాట్లాడుతూ.. రెండు పార్టీలు అవినీతితో ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కర్ణాటకను మరింత ప్రగతిపథంలో నడుపుతాం అని భరోసానిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, కర్ణాటక ఢిల్లీకి ATM అవుతుంది. JDS అధికారంలోకి వచ్చినప్పుడు, కర్ణాటక ఒక కుటుంబానికి ATM అవుతుందాని ఆరోపించారు అమిత్ షా.
సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో 1700 మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలపై కేసులను వెనక్కి తీసుకున్నారు. కానీ బిజెపి ప్రభుత్వం పిఎఫ్‌ఐని నిషేధించింది, దానితో సంబంధం ఉన్నవారిని కటకటాల వెనక్కి నెట్టిందన్నారు అమిత్ షా
కామెంట్‌ను పోస్ట్ చేయండి