అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో భారత్,చైనా సైనికుల మధ్య ఘర్షణ - 300 మంది చైనా సైనికులను తరిమికొట్టిన భారత సైన్యం

tawang faceoff india-china arunachal pradesh politics meter
File Photo

Arunachal Pradesh :
డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్,చైనా సైనికుల మధ్యలో ఘర్షణ జరిగింది. 300 మందికి పైగా చైనా సైనికులు భారత సైనికులతో ఘర్షణ పడ్డారు. అయితే భారత బలగాలు వారి దాడిని తిప్పికొట్టారు. 

ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడగా, భారత సైనికుల కంటే చైనా సైనికులు ఎక్కువగా గాయాలుపాలయ్యారని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఈ ఘర్షణపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. 

"డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్‌త్సే ప్రాంతంలో చైనా దళాలు చొరబడి యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. వారి ప్రయత్నాన్ని మన భారత దళాలు తిప్పికొట్టాయి. చైనా దళాలు మన భూభాగంలోకి చొరబడకుండా మన భారత సైన్యం ధైర్యంగా ఎదురుకొని వారిని తిరిగివెళ్ళేలా చేసింది" అని అన్నారు రాజ్‌నాథ్ సింగ్. 

0/Post a Comment/Comments