భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజస్థాన్‌లో మీడియా ప్రతినిధులతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్ ఘర్షణలో భారత సైనికులను చైనా సైనికులు దారుణంగా కొట్టారని ఆరోపించారు.
"నేను చూస్తున్నది ఏమిటంటే, చైనా నుండి భారత్కు ముప్పు స్పష్టంగా ఉంది. ఇది విస్మరించలేని,దాచలేని ముప్పు. కానీ బీజేపీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది" అని విమర్శించారు రాహుల్ గాంధీ.
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా సైనికులు దారుణంగా కొట్టారని ఆరోపించారు రాహుల్. లడఖ్, అరుణాచల్ వైపు చైనా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.. అయినా భారత ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతున్న వాస్తవాన్ని మన ప్రభుత్వం దాస్తోందన్నారు.
తవాంగ్ ఘర్షణకు సంబంధించి భారత సైన్యం చైనా బలగాలను తరిమికొడుతున్న అనేక వీడియోలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దళాలు భారత సైనికులను దారుణంగా కొట్టారని రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి