ఢిల్లీ లిక్కర్ స్కాం : రాజగోపాల్ రెడ్డి, కవిత కల్వకుంట్ల మధ్య ట్విట్టర్ వార్

kavitha rajgopal reddy twitter war brs trs bjp politics meter

తెలంగాణ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. కొన్ని నెలలుగా బీజేపీ,టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఇవాళ ట్విట్టర్ లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కవిత పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కు సమందించిన న్యూస్ పేపర్ స్క్రీన్ షాట్ ను కోట్ చేస్తూ "చార్జిషీట్‌లో లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ప్రస్తావించారు" అని ట్వీట్ చేశారు రాజగోపాల్ రెడ్డి.

రాజగోపాల్ రెడ్డి ట్వీట్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంటనే స్పందించారు. "రాజగోపాల్ అన్న.. తొందరపడకు , మాట జారకు !! 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు.. Truth Will Prevail" అని బదులిచ్చారు కవిత.

కవిత ట్వీట్ కు రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. "నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు  కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక  కేటీఆర్ (Twitter Tillu) ఇంకా మీ టీఆర్ఎస్  నాయకులు పారదర్శకరంగా  టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయం లో నా పై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలు కి వెళ్లడం ఖాయం" అని బదులిచ్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు చేర్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED). YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ డాక్టర్ శరద్ చంద్రారెడ్డి పేర్లు కూడా  చార్జిషీట్ లో ఉన్నాయి.


0/Post a Comment/Comments