Gujarat : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్య సమస్యలతో బుధవారం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు.
హీరాబెన్ మోదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని UN మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసుపత్రి ఇతర సమాచారాన్ని పంచుకోలేదు.
నిన్న,డిసెంబర్ 27న కర్ణాటకలోని మైసూరులో జరిగిన కారు ప్రమాదంలో ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఇతర కుటుంబ సభ్యులు గాయపడిన కొద్దిసేపటికే హీరాబెన్ మోదీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి.
నిన్న రాత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి హీరాబెన్ మోదీని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పరామర్శించారు. ఢిల్లీ నుండి సాయంత్రం 4 గంటల సమయంలో విమానంలో వచ్చిన మోదీ తన తల్లితో గంటకు పైగా గడిపి 5.30 గంటలకు ఆసుపత్రి నుండి బయలుదేరారు.