9 డిసెంబర్ 1946, ఇటలీలోని విసెంజా నగరం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు సోనియా గాంధీ. ఆమె రోమన్ క్యాథలిక్ కుటుంబంలో పెరిగారు. స్థానిక పాఠశాలల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, 1964లో బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాషా స్కూల్ లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆమె ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ నగరానికి వెళ్ళింది. ఆ నగరంలోని ఓ గ్రీక్ రెస్టారెంట్ లో 1965లో ఆమె రాజీవ్ గాంధీని కలిసింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో రాజీవ్ ఇంజినీరింగ్ చదివేవారు. వీరిద్దరూ 1968లో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయ్యాకా సోనియా తన అత్తగారూ, అప్పటి భారత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ నివాసానికి మారారు. వీరికి ఇద్దరు పిల్లలు. (రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ).
తన భర్త రాజీవ్ గాంధీ హత్య తర్వాత, సోనియా గాంధీని కాంగ్రెస్ నాయకులు పార్టీని నడిపించమని ఆహ్వానించారు, కానీ ఆమె నిరాకరించింది. పార్టీ నుండి చాలా అభ్యర్ధన తర్వాత 1997లో రాజకీయాల్లో చేరేందుకు సోనియా అంగీకరించింది; మరుసటి సంవత్సరం, ఆమె పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నాయకత్వంలో, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి 2004,2009 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి