మన దేశాన్ని రక్షించే సైనికులను అగౌరవపరచకూడదు - రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలపై జైశంకర్

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించారు విదేశాంగ మంత్రి జైశంకర్.
జైశంకర్ లోక్‌సభలో మాట్లాడుతూ.. “రాజకీయ విమర్శలతో మాకు ఎలాంటి సమస్య లేదు కానీ మన జవాన్లను అగౌరవపరచకూడదు. మన భారత సైనికులు తవాంగ్‌, యాంగ్ త్సే లో 13,000 అడుగుల ఎత్తులో నిలబడి మన సరిహద్దును కాపాడుతున్నారు. వారిని గౌరవించాలి, అభినందించాలి.. అంతేకాని 'పిటై’ అనే పదాన్ని మన జవాన్లకు ఉపయోగించకూడదు" అని వ్యాఖ్యానించారు.
16 డిసెంబర్ 2022న భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజస్థాన్‌లో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌, తవాంగ్ ఘర్షణలో భారత సైనికులను చైనా సైనికులు దారుణంగా కొట్టారని ఆరోపించారు.

0/Post a Comment/Comments