Maharashtra : దేశానికి సుస్థిర అభివృద్ధి అవసరమని, “షార్ట్‌కట్ రాజకీయాలు” కాదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
నాగ్‌పూర్‌లో రూ.75,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"షార్ట్‌కట్ రాజకీయాలు చేసే వారి గురించి నేను మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాను. షార్ట్‌కట్‌లను అనుసరించే రాజకీయ నేతలే దేశానికి అతిపెద్ద శత్రువులు. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అభివృద్ధి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని నేను వారిని కోరుతున్నాను" అని అన్నారు ప్రధాని మోదీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి