Assam : డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత-చైనా మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమస్యలు సృష్టించాలనుకుంటున్నారని సీఎం హిమంత అన్నారు. ఈ అంశాన్ని బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు.
"ఈ చర్చను బహిరంగపరచాలని నేను అనుకోను, ఎందుకంటే మీరు అలాంటి విషయాలను చర్చించినప్పుడు, చైనా వాళ్లు కూడా మన చర్చను జాగ్రత్తగా వింటారు, వారు ఈ చర్చల ఆధారంగా వ్యూహాన్ని రచిస్తారు. ఇటువంటి కీలక సమయాల్లో, మేము మా సైన్యంతో నిలబడతాము అనే ఒక లైనుతో చర్చను ముగించడం ప్రతిపక్షాలకు మంచిది" అని అసోం ముఖ్యమంత్రి హిమంతా బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి