File Photo |
Assam : తన రాష్ట్రంలో 50 శాతం కాంగ్రెస్‌ను తానే నడుపుతున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం ప్రకటించారు.
ఇండియా టుడే నార్త్ ఈస్ట్ టౌన్‌హాల్‌లో అసోం ముఖ్యమంత్రి హిమంతా బిస్వా శర్మ మాట్లాడారు.."నేను కాంగ్రెస్‌లో 22 సంవత్సరాలు గడిపాను. నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ నాయకులతో నాకున్న సంబంధం ఒక్క రోజులో ముగిసేది కాదు. నేను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన చాలా మంది స్నేహితులు, యువకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారు నా దెగ్గరికి సలహాల కోసం వస్తారు, నేను వారికిచ్చిన సలహాలకు ఎం డబ్బు వసూలు చేయను" అని అన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి