డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్ - చైనాల మధ్య జరిగిన ఘర్షణపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. భారతీయ జనతా పార్టీ(BJP) అధికారంలో ఉన్నంత కాలం ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరని అన్నారు.
"ఇవాళ భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరు. డిసెంబర్ 8-9 మధ్య రాత్రి (అరుణాచల్ ప్రదేశ్‌లో) మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమానికి నేను వందనం చేస్తున్నాను" అని అన్నారు అమిత్ షా
#WATCH | Today there is a BJP government in the country. As long as our govt is there no one can capture even an inch of land. I salute the valour shown by our Indian Army troops on the intervening night of December 8-9 (in Arunachal Pradesh): Union Home Minister Amit Shah pic.twitter.com/hsBTJv8dcN
— ANI (@ANI) December 13, 2022
ఈ తవాంగ్ ఘర్షణలో 300 మంది చైనా సైనికులను తరిమికొట్టారు భారత సైనికులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి