హిమాచల్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు - ప్రతిభా సింగ్ మద్దతు దారుల నిరసన


Himachal Pradesh :
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూను ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్. 

ముఖ్యమంత్రి పదవికి ప్రతిభా సింగ్, ముఖేష్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రధాన పోటీదారులుగా ఉన్న క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సుఖ్విందర్ సింగ్ సుఖూను ఎంపిక చేసింది. 

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా వీరభద్ర సింగ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని మూడు రోజులుగా వార్తలు వచ్చాయి.

ప్రతిభా వీరభద్ర సింగ్ మద్దతుదారులు హిమాచల్ తదుపరి ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖ్‌ను చేయాలనే హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా సిమ్లాలో నినాదాలు చేశారు. "హైకమాండ్ హోష్ మే ఆవో" అంటూ నినాదాలు చేశారు. 

ఉత్కంఠభరితంగా సాగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 68 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాదించగా , బీజేపీ 25 స్థానాలు, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచారు. బీజేపీకి 42.99%, కాంగ్రెస్ కి 43.91% శాతం ఓట్లు వచ్చాయి. 



0/Post a Comment/Comments