సిక్కిం ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది భారత సైనికులు మృతి - సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ


Sikkim :
సిక్కింలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది భారత ఆర్మీ జవాన్లు మరణించారు. 

ఉత్తర సిక్కిం సమీపంలోని జెమా ప్రాంతం వద్ద ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు, నలుగురు గాయపడ్డారు.

మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఉదయం చటెన్(Chatten) నుండి థాంగు(Thangu) వైపు వెళ్తుండగా, అందులోని ఒక ఆర్మీ ట్రక్కు జెమా ప్రాంతం వద్ద మలుపు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.





0/Post a Comment/Comments