బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి..

 

marri shashidhar reddy joins bjp Telangana politics meter

కాంగ్రెస్ సీనియర్ నేత,సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఈరోజు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ కే లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ఇతర నేతలు పాల్గొన్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పోరాడి ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మర్రి శశిధర్ రెడ్డి వాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్‌ లేదని, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారశైలి వల్లే నేడు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని అన్నారు శశిధర్ రెడ్డి. 

0/Post a Comment/Comments