ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో వివాదంపై స్పందించిన కేజ్రీవాల్

satyendra jain tihar jail massage video arvind kejriwal  bjp -aap politics meter

ఆప్ నేత సత్యేందర్ జైన్ వైరల్ మసాజ్ వీడియోపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 

మసాజ్, వీఐపీ ట్రీట్‌మెంట్ అని ఆరోపిస్తున్నారు కానీ అది ఫిజియోథెరపీ మాత్రమే. ఇక్కడ గుజరాత్‌లో అమిత్ షా మంత్రిగా ఉండి అరెస్టు అయినప్పుడు వీఐపీ ట్రీట్‌మెంట్ పొందారు, అయితే సత్యేందర్ జైన్‌కు అలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఏమిలేదని కేజ్రీవాల్ అన్నారు.

శనివారం (నవంబర్ 19) ఉదయం ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో శరీరానికి మసాజ్ చేయించుకున్న CCTV వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సెప్టెంబరు 13 నాటి సీసీటీవీ ఫుటేజీలో మంత్రి తన బెడ్‌పై పడుకుని కొన్ని పేపర్లు చదువుతుండగా, అతని పక్కనే కూర్చున్న వ్యక్తి తన పాదాలకు మసాజ్ చేస్తూన్నా వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మంత్రి జైన్‌కు తీహార్ జైలులో ప్రత్యేక ట్రీట్‌మెంట్ లభిస్తోందని ED ఆరోపించిన 10 రోజుల తర్వాత నవంబర్ 19 న ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

0/Post a Comment/Comments