రాహుల్ భారత్ జోడో యాత్రలో నేపాల్ జాతీయ గీతం - నెటిజన్లు ఫైర్

Rahul Gandhi Nepal national anthem Bharat jodo yatra Maharashtra Politcs meter

Maharashtra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఓ అవాంఛనీయ సన్నివేశం చోటుచేసుకుంది. 
భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని వాషిమ్ చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ దాదాపు 30 నిమిషాలపాటు ప్రసంగించారు. ఆ తర్వాత రాహుల్ జాతీయ గేయం "వందే మాతరం"ను పెట్టమని అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలకు కోరగా వాళ్ళు నేపాల్ జాతీయ గీతాన్ని ప్లే చేసారు. దీన్ని ఆపండని రాహుల్ వాళ్ళని ఆదేశించాగా వాళ్ళు ఆపేసి భారత జాతీయ గీతాన్ని ప్లే చేశారు. 

నిజానికి రాహుల్ గాంధీ జాతీయ గేయం(National Song) 'వందే మాతరం'ను పెట్టామన్నారు. అడిగింది పెట్టకుండా నేపాల్ జాతీయ గీతాన్ని ఆ తర్వాత మన జాతీయ గీతాన్ని(National Anthem) ప్లే చేసారు. రాహుల్ అడిగిన 'వందే మాతరం'ను మాత్రం పెట్టలేదు.. 

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాహుల్ గాంధీకి జాతీయ గేయానికి, జాతీయ జీతానికి మధ్య ఉన్న తేడా కూడా తెలియదని బీజేపీ పార్టీ నాయకులూ విమర్శలు చేస్తున్నారు.. 

0/Post a Comment/Comments