పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మనోజ్ తిగ్గా కూడా సువేందు అధికారితో కనిపించారు..
సమావేశం అనంతరం సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ "నేను ఈరోజు సీఎం మమతా బెనర్జీతో 3-4 నిమిషాల పాటు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యాను. నందిగ్రామ్ నుండి పోటీ చేయడం మమత జీపై వ్యక్తిగత పోరాటం కాదు, రాజకీయ & సైద్ధాంతిక పోరాటం" అని అన్నారు.
Kolkata, West Bengal | I had a 3-4 min long courtesy meeting with CM Mamata Banerjee today. Contesting from Nandigram was not a personal fight against Mamata (Banerjee) Ji, but a political & ideological fight: LoP & BJP leader Suvendu Adhikari pic.twitter.com/vmUU26Mid7
— ANI (@ANI) November 25, 2022
సువేందుతో సమావేశం అనంతరం బెంగాల్ సీఎం మమత అసెంబ్లీ సమావేశంలో సువెందును తన సోదరుడిగా సంబోధించారు. "నేను అతనిని సోదరుడిలా ప్రేమించాను, అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు" అని మమత అన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి