2023 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడిని ఆహ్వానించిన భారత్..

India egypt republic day chief guest politics meter
Egypt President Abdel Fattah El-Sisi, PM Narendra Modi (File Photo)

2023 గణతంత్ర దినోత్సవానికి భారతదేశం ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.

ఈజిప్టు తో తన రాజకీయ, సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా, వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసిని భారతదేశం ఆహ్వానించింది. 

ఆఫ్రికా ఖండంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం ఈజిప్టు. రెండు దేశాలు ఈ ఏడాది తమ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి.

నివేదికల ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో ఢిల్లీ-కైరో సంబంధాలు ప్రత్యేక ప్రాధాన్యతను పొందుతాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో ఈజిప్టు ను సందర్శించి, ఈజిప్టు అధ్యక్షుడిని కలిశారు. 

ప్రధాని మోదీ వ్యక్తిగత సందేశాన్ని జైశంకర్ ఈజిప్టు అధ్యక్షుడికి అందించారు.

0/Post a Comment/Comments