ఆగస్టు 22న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో 'సర్ తాన్ సే జుడా' (Sar tan se juda) నినాదాలు చేశారన్న ఆరోపణలపై రాచకొండ పోలీసులు ఎంఐఎం నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఎంఐఎం నేతలు సదర్ అలీ, జాఫర్‌ఖాన్, నస్రీన్ సుల్తానాలపై మత హింస నిరోధక చట్టం(Prevention of Religious Violence Act) మరియు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని చిన్నారులు ‘సర్ తాన్ సే జుడా’ అంటూ నినాదాలు చేస్తున్న సోషల్‌మీడియా వీడియోలపై దృష్టి సారించాలని, నిరసనల్లో పాఠశాల విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(National Commission for Protection of Child Rights) హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆగస్టు 24న లేఖ రాసింది.
AIMIM leaders including Sadar Ali, Zaffer khan and Nasreen Sulthana booked in the FIR.
— ANI (@ANI) November 19, 2022
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆగస్ట్ 25న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. నవంబర్ 9న తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్‌లో ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ విడుదలయ్యారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి