మెగా స్టార్ చిరంజీవి పై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ..

నటుడు, నిర్మాత, మాజీ రాజకీయ నాయకుడు కొణిదెల చిరంజీవి 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో  ఇండియా ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ఎంపికయ్యారు.
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందజేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దాదాపు నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో 150కి పైగా చిత్రాలలో నటించారు చిరంజీవి.

ప్రధాని నరేంద్ర మోదీ అనురాగ్ ఠాకూర్ పెట్టిన ట్వీట్ కు స్పందిస్తూ.. "చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు ." అని ట్వీట్ చేసారు.
ప్రధాని మోడీ మాటలకూ చిరంజీవి స్పందిస్తూ.." గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ, ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మీ మంచి మాటలకు చాలా కృతజ్ఞతలు! " అని అన్నారు

0/Post a Comment/Comments