భారతదేశం ప్రగతి పథంలో పయనిస్తోంది, కానీ ఆప్(AAP) ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు.
వాయువ్య ఢిల్లీలోని వజీర్‌పూర్‌లో నడ్డా ఇంటింటికీ వెళ్లి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. ఆయన స్థానికులతో మమేకమై బీజేపీ పార్టీ ‘సంకల్ప్ పత్ర’ (మేనిఫెస్టో) కాపీలను అందజేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తమ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో "వీఐపీ ట్రీట్‌మెంట్" పొందుతున్నారన్న వివాదంపై కూడా ఆయన మండిపడ్డారు.
కేజ్రీవాల్ ప్రభుత్వంలో జరిగిన వివిధ కుంభకోణాలను ప్రజలకు వివరికిచ్చారు నడ్డా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి