అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంటును పునరుద్ధరించారు ట్విట్టర్ సీఈఓ ఎలోన్ మస్క్.
డొనాల్ ట్రంప్ అకౌంట్ ను పునరుద్ధరించాలా వద్ద అని ఎలోన్ మస్క్ ట్విట్టర్ లో పోల్ నిర్వహించారు. దానికి అనూహ్య స్పందన వచ్చింది. ట్విట్టర్ యూజర్లూ డోనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేసిన తర్వాత అతని ఖాతాను తిరిగి పునరుద్ధరించారు.
నిర్వహించిన పోల్ లో 52 శాతం మంది ట్రంప్ అకౌంట్ ని పునరుద్దరించాలని ఓట్లు వెయ్యగా, 48 శాతం మంది ట్రంప్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
జనవరి 6, 2021 నాటి కాపిటల్ హాల్ హింస తర్వాత అప్పటి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ను ట్విట్టర్ శాశ్వతంగా సస్పెండ్ చేసిన విషయం తెకిసిందే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి