తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది.
బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు బీజేపీ కార్యకర్తలను భైంసా వెళ్లేందుకు అనుమతించకపోవడంతో బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
నిన్న రాత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వివాదంపై పలువురు తెలంగాణ బీజేపీ లీడర్లు స్పందించారు.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ "బైంసా కి వెళ్లనివ్వకుండా బండి సంజయ్ గారిని పోలీసులు అడ్డుకోవడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బైంసా కి వెళ్ళడానికి వీసా ఎమన్నా అవసరమా కెసిఆర్? తెలంగాణ ఎమన్నా నీ జాగీరా కేసీఆర్? తెలంగాణలో కెసిఆర్ ప్రజాస్వామ్యంని ఖూనీ చేస్తున్నాడు." అని అన్నారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందిస్తూ "బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ బండి సంజయ్ గారి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కు అనుమతినియ్యకుండ అడ్డుకుంటున్న కెసిఆర్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
బీజేపీ పార్టీ ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేసినా, వణుకుతున్న KCR !" అని అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ "ప్రజల గొంతును అణచివేయడం,బహిరంగ సభలను నిషేధించడం,ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడులు చేయడం TRS అవినీతి, కుటుంబపాలనలో సర్వసాధారణం అయిపోయింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు తలపెట్టిన ప్రజా సంగ్రామయాత్రకు TRSప్రభుత్వం అనుమతిని నిరాకరించటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను." అని అన్నారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందిస్తూ "తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని అడ్డుకోవడం కెసిఆర్ యొక్క పిరికిపంద చర్య... కెసిఆర్ ఓటమి భయంతోనే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అనుమతి ఇచ్చి, మళ్ళీ రద్దు చేయడం సిగ్గుచేటు." అని అన్నారు
మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ "రేపు బైంసా నుంచి బండి సంజయ్ గారి "ప్రజా సంగ్రామ యాత్ర" మరియు బహిరంగ సభకు ముందు ఇచ్చిన అనుమతిని రద్దు చేసి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడంను తీవ్రంగా ఖండిస్తున్నాం. యాత్రను, సభను యధావిధిగా అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాం " అని అన్నారు.