నిర్మల్ జిల్లా ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం లో జరిగిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. "తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలందిరికీ ఉచిత విద్య-వైద్యం అందిస్తాం. నిలువనీడలేని పేదోళ్లందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తాం. అకాల వానలతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారమిస్తాం." అని అన్నారు.
సమస్యల పరిష్కారం కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధర్నా చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని, కడెం ప్రాజెక్టు గేట్ల మేయింటెనెన్స్ కు నిధులు ఇవ్వలేనోడు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు? అని అన్నారు.
"మతవిద్వేషాలు రగిలించే ఎంఐఎం నాయకులు ఎక్కడైనా తిరగొచ్చట, హిందూ దేవతలను కించపర్చే కమెడియన్ మునావర్ ఫారుఖీ లాంటి వాళ్లు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చట, కానీ దేశం కోసం, ధర్మం కోసం హిందు ధర్మాన్ని కాపాడే బిజెపి వాళ్లు మాత్రం భైంసాలో సభలు పెట్టుకోవద్దట." అని అన్నారు బండి సంజయ్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి