బీజేపీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్‌లోని అరవింద్ ధర్మపురి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.
అరవింద్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఇంట్లోని కారు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దడి ఫై ఎంపీ అరవింద్ స్పందించారు. "కేసీఆర్, KTR, K.కవిత ల ఆదేశాలపై హైదరాబాద్ లోని నా ఇంటిపై దాడి చేసిన TRS గుండాలు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు!" అని అరవింద్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి