Gujarat : ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు గుజరాత్లో నిరసన సెగ తగిలింది. సూరత్‌లో ముస్లిం యువకులు ఒవైసీకి నల్లజెండా చూపించి ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయనుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కొన్ని నెలల క్రితం ప్రకటించారు.
అందులో భాగంగా, సూరత్ తూర్పు(Surat East) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి వసీం ఖురేషి తరపున ప్రచారం చేసేందుకు ఒవైసీ సూరత్ వెళ్లారు .
అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఒవైసి మాట్లాడుతుండగా కొంతమంది ముస్లిం యువకులు ఒవైసీకి నల్లజెండా చూపించి ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Owaisi greeted with ‘Modi, Modi, Modi’ & ‘Go Back’ slogans in Surat. pic.twitter.com/BTHl2hDrco
— News Arena India (@NewsArenaIndia) November 14, 2022
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల డిసెంబర్ 1,5 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి