శివసేన పార్టీ ఎన్నికల గుర్తు వివాదం - ఉద్ధవ్ ఠాక్రే పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

 

Shivsena party symbol Uddhav Eknath Shinde Delhi high Court

Maharashtra: శివసేన పార్టీ ఎన్నికల గుర్తును ఫ్రీజ్ చేయాలన్న భారత ఎన్నికల సంఘం (ECI) నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు గురించి చాలా రోజులు నుంచి ఉద్దవ్ థాకరే ఫ్యాక్షన్, ఎకనాథ్ షిండే ఫ్యాక్షన్ ల మధ్య వివాదం జరుగుతుంది. 

ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్, (NCP)ఎన్‌సిపితో పొత్తు కుదుర్చుకున్నందుకు ఉద్ధవ్ థాకరేపై ఏకనాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో శివసేన రెండు గ్రూపులుగా విడిపోయింది. ఆ తర్వాత శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలలో 40 మందికి పైగా షిండేకు మద్దతు ఇవ్వడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి థాకరే రాజీనామా చేశారు.

జూన్ 30, 2022న బీజేపీ మద్దతుతో ఏకనాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

0/Post a Comment/Comments