Uttar Pradesh : అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మైన్ పురి ఉపఎన్నికలో పోటీ చేయనున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు డింపుల్ యాదవ్.
అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.."డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి, మైన్ పురి ప్రజలు డింపుల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను" అని అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం ఈ ఉపఎన్నిక జరుగుతుంది. డింపుల్ యాదవ్ 2019 లోక్ సభ ఎన్నికల్లో కనౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడిస్తారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి