ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) రూ.3,940 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది.
మచిలీపట్నం పోర్టు రూ.5,253.89 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. డిసెంబర్ 21న మచిలీపట్నం పోర్టు పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
"బందరు పోర్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు మొత్తం 3940 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(PFC) సంస్థ ద్వారా తెచ్చాను అని చెప్పటానికి సంతోషిస్తున్నాను. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం" అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి