ప్రధాని మోదీ పై ప్రశంసల జల్లు కురిపించిన జనసేన అధినేత పవన్

Pawan Kalyan Twitter Narendra Modi Posts Politics Meter

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 11న విశాఖపట్నంలోని INS చోళ గెస్ట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. 

జనసేన అధినేత ఈరోజు ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గురించి పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్టుల సారాంశం :

• గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన శ్రీ మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు.

• ‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రస్థానానికి అద్దంపడతాయి. 

• క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని సమాదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారు. 

• ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి శ్రీ నరేంద్ర మోదీ గారు.

 


 

పవన్-మోదీ భేటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. 

0/Post a Comment/Comments