Gujarat : బిజెపి ఒత్తిడి వల్ల కాదు, AAP కార్యకర్తలు డబ్బులు డిమాండ్ చేయడం వల్లే నేను నామినేషన్ ఉపసంహరించుకున్నానని AAP సూరత్ ఈస్ట్ అభ్యర్థి కంచన్ జరీవాలా తెలిపారు.
బుధవారం మీడియాతో కంచన్ జరీవాలా మాట్లాడుతూ.. నామినేషన్ ఉపసంహరణకు బిజెపి ఒత్తిడి చేసిందని వస్తోన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారానికి డబ్బులు డిమాండ్ చేసిన ఆప్(AAP) కార్యకర్తలే తన నామినేషన్ ఉపసంహరణకు కారణమన్నారు. ఎన్నికల ప్రచారానికి తాను రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేయలేనని, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ నుండి చాలా ఒత్తిడి వచ్చిందని పేర్కొన్నారు. కిడ్నప్ వార్తలను ఖండించిన జరీవాలా తన కుమారుడి స్నేహితులతో సమయం గడపానని చెప్పారు.
Reason for withdrawing my nomination was that (AAP) workers in Surat(East) Assembly started resigning. The workers started demanding money. I'm not capable enough to spend Rs 80 lakh to Rs 1 crore. Their demand was so much that I couldn't fulfil it: AAP candidate Kanchan Jariwala pic.twitter.com/mOyIxK4fK7
— ANI (@ANI) November 16, 2022
బుధవారం, అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్(AAP) నేతలు బీజేపీ తమ సూరత్ ఈస్ట్ అభ్యర్థి కంచన్ జరీవాలాను కిడ్నాప్ చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
Our candidate from Surat (East), Kanchan Jariwala, and his family missing since yesterday. First, BJP tried to get his nomination rejected. But his nomination was accepted. Later, he was being pressurised to withdraw his nomination.
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 16, 2022
Has he been kidnapped?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల డిసెంబర్ 1,5 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి