గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్ని రికార్డులను బద్దలు కొట్టి అత్యధిక సీట్లతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
మీడియా ప్రతినిధులతో అమిత్ షా మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ, సీఎం పటేల్ నాయకత్వంలో అభివృద్ధి పనులు శెరవేగంగా జరుగుతున్నాయి. గుజరాత్ శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తే భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు" అని అన్నారు.
మొత్తం 182 స్థానాలకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి